ఒకవైపు ‘పింక్’ మరోవైపు క్రిష్ చిత్రం తో బిజీగాఉన్న పవన్…

పవన్ కళ్యాణ్ –  క్రిష్  కాంబినేష‌న్‌లో శ‌ర‌వేగంతో ఓ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది.. హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ చిత్రానికి సంబంధించి పెద్ద సెట్టులో ,  ఒకవైపు ‘పింక్’ రీమేక్ చేస్తూనే మరోవైపు క్రిష్ చిత్రాన్ని కూడా  ప‌వ‌న్ లాగించేస్తున్నారు…చిత్రం తో బిజీగాఉన్న పవన్ 
ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో క‌నిపిస్తాడ‌ని వార్త‌లొస్తుండ‌గా తాజాగా   ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. 

ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా,  వేస‌విలో  ఈ చిత్రం   విడుదలకానుందని స‌మాచారం. అయితే ఈ చిత్ర టైటిల్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త‌ని యూనిట్ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ ‘విరూపాక్ష’  ప‌వ‌న్‌కి విభిన్న‌మైన టైటిల్ అవుతుంద‌ని అభిమానులు చెపుతున్నారు. మ‌రి ఏం చెప్తారో చూద్దాం

Leave a Reply

Your email address will not be published.