శ్రీ‌కాంత్ తో బాల‌య్య గొడ‌వ‌… అస‌లు కధ ఏం టంటే …?నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. అయితే వినయ విధేయ రామ సినిమాతో ప్లాప్ చూసిన బోయపాటి ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని బాలయ్యతో మాస్ సినిమాని తెరకెక్కిస్తున్నాడట.


ఇక టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం యాంకర్ రష్మీని ఫైనల్ చేశారట. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో కాస్టింగ్ పై ప్రస్తుతం ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అందులో బాలయ్యకి యాంటీ గా హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ యుద్దం శరణం అనే మూవీలో చైతుకి విలన్ గా నటించాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో శ్రీకాంత్ కి పెద్దగా గుర్తింపు రాలేదు.


అయితే మలయాళంలో మోహన్ లాల్ కి విలన్ గా శ్రీకాంత్ నటించి మెప్పించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలుగులో విలన్ పాత్రలను అద్భుతంగా తెరకెక్కించే బోయపాటి చేతిలో శ్రీకాంత్ పడ్డాడని చెప్పుకుంటున్నారు. లెజెండ్ మూవీతో జగపతి బాబుకి విలన్ గా అదిరిపోయే కెరీర్ ను ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు శ్రీకాంత్ ని కూడా తనదైన శైలిలో చూపించబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక శ్రీ‌కాంత్ విష‌యానికి వ‌స్తే ఇటు హీరోగానే కాకుండా అటు విల‌న్ గా కూడా చాలా సినిమాల్లో న‌టించాడు కానీ అవి పెద్ద‌గా హిట్ కాలేదు. శ్రీ‌కాంత్ ఏ పాత్ర‌నైనా స‌రే అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌డు. అలాగే హీరో ప‌క్క‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా గ‌తంలో చాలానే పాత్ర‌లు పోషించాడు. ఆయ‌న న‌టించిన ప్ర‌తి పాత్ర‌కి మంచి పేరు వ‌చ్చింద‌నే చెప్పాలి. చిన్న హీరో నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు దాదాపుగా మ‌ల్టీ స్టార‌ర్లు కూడా ఆయ‌న చేశ‌రు

Leave a Reply

Your email address will not be published.