షుగ‌ర్ ఉందా…అయితే ఇవి పాటించ‌క త‌ప్ప‌దు…?

ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ ఎక్కువ శాతంలో బాధించే వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీన్ని పూర్తిగా నివారించే మందు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమాల‌ను పాటిస్తే వ్య‌ధిని కొంత వ‌ర‌కు కంట్రోల్ లో ఉంచ‌వ‌చ్చు. షుగర్‌తో  బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు.  సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఆహారం వైట్ బ్రెడ్. ధర కూడా తక్కువే. కానీ వైట్ బ్రెడ్‌లో చక్కెర శాతం, కార్బోహైడ్రేడ్లు అధికం. ఇవి మన శరీరంలో షుగర్ లెవెల్స్ ని అమాంతం పెంచేస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు దీన్ని పక్కన పెడితే మంచిది. అదే విధంగా మ‌నం తాగే పాల‌ల్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాలను మరింత పెంచేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు పాల‌తో  పాటు పాలకోవ, మైసూర్‌పాక్ వంటి డైరీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.  మనం సాధారణంగా తెల్ల అన్నం ఎక్కువగా తింటాం. దీనిలో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తింటే మంచిది. అలాగే రైస్‌కి బ‌దులుగా కొర్ర‌లు, లేదా గోధుమ చ‌పాతి ఇంకా మంచివి.

సాధారణంగా చాలా మంది బంగాళా దుంపలు (ఆలు గడ్డలు) తినడానికి ఇష్టపడరు. వాతంచేసే గుణం దీనిలో ఉంటుందని అంటారు. అయితే షుగర్ లెవెల్స్ ను  పెంచేసే గుణం కూడా బంగాళాదుంపలకు ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. పండ్ల రసాలను ఎక్కువగా తీసుకునేవారిలో సగటున 18 శాతం మంది డయాబిటిస్ బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఎండు ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డాక్టర్ చక్కెర తినొద్దన్నారు కదా అని చాలా మంది షుగర్ పేషెంట్లు కృత్రిమంగా తయారుచేసిన తీపి పదార్థాలను తింటారు. కానీ ఇవి కూడా మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. మరి వీట‌న్నిటినీ పాటించ‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను కంట్రోల్‌లో ఉంచ‌వ‌చ్చు. అలాగే షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు ఉద‌యాన్నే లేచి వాకింగ్ చేయ‌డం చాలా మంచిది.


Leave a Reply

Your email address will not be published.