సంగీత నృత్య అకాడమి ఛైర్మన్ గా వందేమాతరం

రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమకానికి ఉత్తర్వులు రడీ అయ్యాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ఆమోద ముద్ర వేసారు . అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గామద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయేల్, సాహిత్య అకాడెమి ఛైర్మన్ గా ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, సంగీత నృత్య అకాడమి ఛైర్మన్ గా వందేమాతరం శ్రీనివాస్, జానపద కళలు, సృజనాత్మకత అకాడమి(ఫోక్ అండ్ క్రియేటివ్ అకాడమి) ఛైర్మన్ గా పొట్లూరి హరికృష్ణ ను నియమితులయ్యారు.