హైదరాబాదీగా నభా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్నచిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది. ఇక ఈచిత్రంలో ముద్దుగుమ్మలు ఇద్దరున్నారు. ఇటీవల మొదటి హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఖరారు చేయగా తాజాగా రెండవ హీరోయిన్ ను ఏంపిక చేశారు.
‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో యువత మనసు దోచుకున్న యువ హీరోయిన్ నాబా నటేష్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించనున్నారు. ఈ చిత్రంలో ఆమె హైదరాబాదీ అమ్మాయిగా కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం మే లో విడుదలకానుంది.