‘మిర్జియా’తో పరిచయమైన నటి సయామీ ఖేర్ నాగార్జునతో నటించే అవకాశం పొందింది…రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన బాలీవుడ్ సినిమాలో ‘మిర్జియా’తో పరిచయమైన నటి సయామీ ఖేర్ దక్షిణాదిన సూపర్ స్టార్ నాగార్జునతో నటించే ఛాన్స్ సంపాదించింది. యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా నాగార్జున నటిస్తుండ‌గా సయామీ ‘రా’ ఏజెంట్ పాత్రలో పోషిస్తోంది. ఆదివారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న సంద‌ర్భంగా కాసేపు మీడియాతో ముచ్చ‌టించింది.

“ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగార్జున గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన గౌరవం. యాక్షన్ ఫిల్మ్ చెయ్యాలనేది ఎప్పట్నుంచో నాకున్న కోరిక. ఎందుకంటే ఆ జానర్ సినిమాలను నేను ఇష్టపడతాను. కొన్ని రోజులుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. సెట్స్ పై జాయిన్ కావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అని సయామీ తెలిపింది. 

రంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్న ఈ సినిమా పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ‘వైల్డ్ డాగ్స‌లో త‌న దైన శైలిలో యాక్షన్ రోల్ చేసి ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించేందుకు సయామీ రెడీ అవుతోంది.ఆమెపై కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు ఉంటాయని, దీని కోసం ఆమె ముంబైలో శిక్షణ కూడా తీసుకున్న‌ట్టు చెప్పింది.Leave a Reply

Your email address will not be published.