ద‌క్షిణ కొరియా చిత్రం కాపీ అంటు ట్రోల్

ఈ మ‌ధ్య ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా  రికార్డ్‌కెక్కిన పార‌సైట్ ఇప్పుడు వివాదాల‌లో చిక్కుకుంది. ఈ ద‌క్షిణ కొరియా చిత్రం ఏకంగా ఉత్త‌మ‌చిత్రం, డైరెక్ట‌ర్‌, విదేశీచిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో నాలుగు అవార్డులు ద‌క్కించుకోగా ఈ సినిమా విజ‌య్  న‌టించిన త‌మిళ చిత్రం `మిన్‌సార క‌న్నా`కు కాపీ అంటు ఇప్పుడు తెగ ట్రోల్ అవుతోంది సామాజిక మీడియాలో.
పార‌సైట్ సినిమా కాన్సెప్ట్ త‌మిళ చిత్రానిదేన‌ని విజ‌య్ కెరీర్ ప్రారంభంలో  కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్వ‌కత్వంలో రూపొందిన‌ `మిన్‌సార క‌న్నా` క‌థ‌ని కాపీ కొట్టేసార‌ని కోలీవుడ్ మండిప‌డుతోంది. 
ఈ క్ర‌మంలో `మిన్‌సార క‌న్నా`  చిత్ర నిర్మాత  తేనప్ప‌న్   `పార‌సైట్` సినిమాపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకునేందుకు సిద్ద‌మవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఓ ఆస్కార్ సినిమాకు కాపీ సినిమా అనే ఆరోప‌ణ‌లు రావ‌డం శోచ‌నీయమే అయినా వాస్త‌వ ప‌రిస్థితి దృష్ట్యా పార‌సైట్ చిత్రాన్ని నిర్మించిన‌ బొంగ్ జున్ హో  ని అంత‌ర్జాతీయ కోర్టుల‌కులాగాల‌ని  నిర్మాత భావిస్తున్నాడ‌ట‌. ఈ మేర‌కు ఓ ఇంటర్నేష‌న‌ల్ న్యాయ‌వాదితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయిమ‌రేం జ‌ర‌గ‌నుందో చూడాలి.  
 

Leave a Reply

Your email address will not be published.