నితిన్ ని అభినందించిన ప‌వ‌న్


యంగ్ హీరో నితిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్నల కలయికలో టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా భీష్మ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిఎంటర్టైనింగ్   సినిమా గా సూపర్ హిట్ టాక్  తెచ్చుకున్న ఈ చిత్ర యూనిట్ సోమ‌వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ను క‌లుసుకుంది. 

ఈ సంద‌ర్భంగా సినిమా విశేషాలు తెలియ‌జేయ‌టంతో పాటు నితిన్ ఈ సినిమా పాట‌ల‌ను , ప‌లు స‌న్నివేశాలు నితిన్‌ ప్రత్యేకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి చూపించారు. వీటిని వీక్షించిన ప‌వ‌న్ వారిని అభినందించారు. మా సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెచ్చుకుని  అభినందనలు తెలపడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో అత్యంత మధుర  ఘట్టంగా హీరో నితిన్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు వెంకీ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పవర్ స్టార్ తో క‌ల‌సి తీసుకున్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో  చిత్ర యూనిట్ పోస్టు చేసింది. 

Leave a Reply

Your email address will not be published.