ప్ర‌భాస్‌కి షాక్ ఇచ్చిన శర్వా…?

జాన్.. ఈ పేరు చెప్పగానే ప్రభాస్ మూవీ కళ్లముందు కదలాడుతుంది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ ఇదే. క్లాప్ బోర్డ్ మీద కూడా ఇదే పేరు కనిపిస్తుంది. ఇప్పుడు దిల్ రాజు త‌న సినిమాకు ఈ టైటిల్ వాడేశాడు..

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా దిల్ రాజు బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో కల్ట్ ప్రేమకథగా పేరు తెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీకి జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు అదే టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ సినిమాకు ఇక జాన్ అనే టైటిల్ పెట్టరనే విషయం అర్థమైపోయింది.

ఈ టైటిల్ అనుకున్న‌ప్ప‌టి నుంచి కూడా ప్ర‌తి ఒక్క‌రి క‌న్ను ఎందుకోగాని ఈ టైటిల్ మీదే ప‌డింది.  తమిళ చిత్రం ‘96’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ పెట్టారు. ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన  ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. మొత్తానికి ప్రభాస్ ఎంతో ఇష్టపడిన ‘జాన్’ టైటిల్‌ను దిల్ రాజు, శర్వానంద్‌ల కోరిక మేరకు ప్రభాస్ త్యాగం చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక మ‌రి ప్ర‌భాస్ చిత్రానికి టైటిల్ కోసం మ‌ళ్ళీ వెత‌కాల్సి వ‌స్తుంది. ఇలా ఒక‌టే టైటిల్ వెన‌క ఇంత మంది ప‌డ‌డానికి కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ ముందుగా అనుకున్న‌వారికి కాస్త న‌ష్టం జ‌రిగిన‌ట్టే. ఇంత‌కీ ప్ర‌భాస్ చివ‌రికి మ‌ళ్ళీ ఏ టైటిల్‌ని ఎన్నుకుంటాడో ఏంటో. ఇక ఇదిలా ఉంటే ప్ర‌భాస్ త‌ర్వాత చిత్రం కూడా దాదాపు అంతే హై బ‌డ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్క‌బోతుంద‌ని స‌మాచారం. ఇక ప్ర‌భాస్ నార్మ‌ల్ బ‌డ్జెట్ సినిమాలు చెయ్య‌రేమో అన్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.


Leave a Reply

Your email address will not be published.