‘గర్జన’ పోస్టర్ విడుదల

శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ నిర్మించిన‌ చిత్రం ‘గర్జన’.   మనిషి, జంతువు… వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం అనే అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో  టామ్ అండ్ జెర్రీ కథ మాదిరిగా ఓ చిన్నారి,  ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.  ఈ చిత్రం కోసం భార‌త‌దేశం లోనే తొలిసారిగా   విఎఫ్ఎక్స్ తో ఓ పులిని రూపొందించారు.  ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది… మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదని చెప్పేలా ఈ చిత్రం ఉంటుంద‌ని, చిత్ర నిర్మాత  నరేష్ జైన్ మీడియాకు తెలిపారు. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పార్తిబన్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యంఅవుతున్నారు. 

పొలాచ్చి, తలకొన, మున్నార్, చెన్నై, ఊటీ, కొడైకెనాల్ తదితర అంద‌మైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గర్జన పోస్టర్ విడుదల

Leave a Reply

Your email address will not be published.