బ్రిట్నీస్ఫియర్స్ వా? జెన్నిఫర్ వా?


బ్రిట్నీస్ఫియర్స్ వా?  జెన్నిఫర్ వా?

ఆలియావా? అసలు నీవు.. జెన్నిఫర్ లోపెజ్‌వా? అంటూ ఒకటే తెగ ఇదైపోతున్నారు బోయ్స్. పాప్ స్టార్.. ర్యాప్ స్టార్.. రాక్ స్టార్ .. స్టార్ ఎవరైనా ఈ అమ్మడి ముందు దిగదుడుపే!! అగ్ర నిర్మాత మహేష్ భట్ వారసురాలిగా సినీరంగంలో ప్రవేశించిన ఆలియా భట్ ఇంతింతై అన్న చందంగా పెద్ద స్టార్ గా ఎదిగేసింది. రాజీ సినిమాతో 100కోట్ల క్లబ్ నాయికగా సంచలనం సృష్టించింది. ఈ యంగ్ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. త్వరలోనే తాను ప్రేమించిన లవర్ బోయ్ రణబీర్ కపూర్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతోందన్న ప్రచారం ఉంది. లేటెస్టుగా ఆలియా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో పాప్ ప్రపంచాన్ని ఏలిన టాప్ స్టార్స్ బ్రిట్నీ స్పియర్స్, లేడీ గాగ, జెన్నిఫర్ లోపెజ్ రేంజులో కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. బ్లాక్ & వైట్ స్టన్నింగ్ కాంబినేషన్ డ్రెస్ లో మతి చెడగొట్టింది. కెరీర్ పరంగా చూస్తే.. ఆలియా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. కళాంక్, బ్రహ్మాస్త్ర, గల్లీబోయ్ చిత్రాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. ఇవన్నీ 2019  -20 సీజన్‌లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పుడున్న స్టార్స్ లో ఇండియా బెస్ట్ యంగ్ హీరోయిన్ గా వెలిగిపోతోంది ఈ అమ్మడు.

Leave a Reply

Your email address will not be published.