చికెన్ తినండి అనే ప్రచారం వెనుక ఇదీ సంగతి

కరోనా అంటే భయంలేదు…. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదంటూ ఊదరగొట్టిన తెలంగాణ మంత్రి ఈటెల గారికి మాత్రం కరోనా దెబ్బ బాగానే తగిలినట్టు కనిపిస్తోంది. ఈయనగారు పెద్ద ఫౌల్టీ వ్యాపారవేత్త అని చాలా కొద్ది మందికే తెలుసు. దీంతో కరోనా విషయంపై ప్రచారం చాలానే ఆయన అడ్డుకున్నారన్న విమర్శలూ ఇప్పుడు వినిపిస్తున్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలొ తీసుకున్న నిర్ణయం సాక్షాత్తు వైద్య మంత్రి కూడా అయిన ఈజెల రాజేంద్రకు మింగుడు పడని వ్యవహారంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనాకు చికెన్‌కి సంబంధంలేదంటూ తనదైన శైలిలో ఫౌల్ట్రీ ప్రచారం చేసిన ఆయన అయన వీలైనంత ఎక్కువగా చికెన్ తినండంటూ సమయం సందర్భంతో పనిలేకుండా, కనిపించిన వారికి, వినిపించని వారికి దొరికిన ప్రతి ఒక్కరికీ ఏ వేదిక ఎక్కినా చికెన్ తినాల్సిన అవసరాన్ని ప్రస్తావించి మరీ హడావిడి చేసారు.
అయితే ఆయన గారి కోళ్ల ఫౌల్ట్రీలో చాలా కోళ్లు అనేక కారణాలతో చనిపోవటంతో వాటిని సగం దరకైనా సొమ్ము చేసుకునే క్రమంలోనే ఈ ప్రచారం ఆరంభించారట. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ఆయన వ్యాపారం బాగా దెబ్బతిందట. మరి చేసింది లేక కరోనా స్టాక్ మార్కెట్‌నే కాదు కరోనా కారణంగా తాను చేస్తున్న కోళ్ల వ్యాపారంలో తాను అప్పటివరకూ ఏడెనిమిది కోట్ల మేర నష్టపోయిన వైనాన్ని చెప్పుకున్నారు. అదండీ సంగతి..