‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సెకండ్ లుక్ పోస్టర్ విడుద‌ల

image.png
మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం‘. ఈ చిత్రం ద్వారా పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం అవుతుండ‌గా ఆత‌ని స‌ర‌స‌న మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అనూహ్య‌మైన రెస్పాన్స్ రావ‌టంతో మరో లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మీడియాలో మాట్లాడుతూ – “ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింద‌ని, ఈ క్ర‌మంలోనే సెకండ్ లుక్ పోస్టర్ విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు. . ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావ‌స్తోంద‌ని, అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని చెప్పారు. దర్శకుడు అభిరామ్‌ మేకింగ్ ఫ్రెష్ గా ఉందని అచెప్పారు.. ‘జెస్సీ’ కి సినిమాటోగ్రాఫర్ గా వ్య‌వ‌హ‌రించిన సునీల్‌ కుమార్‌ విజువల్స్ చిత్రాన్ని అందంగా తెర‌కెక్కించాడ‌ని అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్ ఈ సిన‌మాలో మాటల తూటాలు పేల్చాడ‌ని ఇవి సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని చెప్పారు.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఈ సినిమా రూపొందుతోంద‌ని చెప్పారు రాజేష్‌ నాయుడు ఈ సంద‌ర్భంగా .


Leave a Reply

Your email address will not be published.