లోకేశ్ డైలాగ్ డెలివ‌రీ ఫెంటాస్టిక్ అంటున్న వ‌ర్మ‌

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. వర్మ తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రంలో చంద్రబాబు వెన్నుపోటు వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో తాజాగా నారా లోకేశ్‌కు సంబంధించి ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “వావ్… ఈ అద్భుత పర్సనాలిటీని చూసి నాకు భయం వేస్తోంది. ఇతను ఎవరో నాకు తెలియదు. కానీ, ఇతను దావూద్ ఇబ్రహీం, ఒసామా బిన్ లాడెన్, పరిటాల రవికన్నా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఎవరైనా ఇతను ఎవరో చెప్పగలరా?” అంటూ ఓ మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేశారు.

ఆ తర్వాత మరో ట్వీట్ పెడుతూ, “అరవింద సమేత చిత్రంలో తారక్ బదులు ఇతన్ని పెట్టి ఉంటే మూడురెట్ల ఘన విజయాన్ని సాధించివుండేది” అన్నారు. అంతటితో ఊరుకోని వర్మ, “ఎవరో ఇతను రాజకీయాల్లో ఉన్నాడని చెప్పారు. కానీ నేను మాత్రం సినీ పరిశ్రమలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. అతని డైలాగ్ డెలివరీ ఫెంటాస్టిక్. అతని వాక్చాతుర్యాన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో పోల్చవచ్చు. సినిమా స్టార్‌కాకుండా రాజకీయాల్లో ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నాడో” అంటూ మరో ట్వీట్ పెట్టి ” మరో వివాదానికి తెరలేపారు. ఇంత‌కీ ఈ వివాదం ఇప్పుడు ఎటుపోతుందో తెలియ‌ట్లేదు. అటు రాజ‌కీయాల్ని ఇటు సినీ ప‌రిశ్ర‌మ‌ని దేన్ని వ‌ద‌ల‌ట్లేదు మ‌న వ‌ర్మ‌.

Leave a Reply

Your email address will not be published.