రాజధాని రైతులు మరొకసారి పాదయాత్ర

రాజధాని కోసం రైతులు, మహిళలు విద్యార్ధులు చేస్తున్న దీక్షలకు తోడుగా నిరసనలు 80వ రోజుకి చేరువవుతున్న ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో భారీగా ఇళ్ల స్దలాలను పంపిణీ చేసందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది కూడా .
కాగా ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రి జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ రాజధాని రైతులు పాదయాత్ర ఆరంభించారు. శుక్రవారం ఉదయం ఉద్దండరాయనిపాలెం శంకుస్థాపన ప్రాంతం నుంచి ఆరంభమైన ఈ పాదయాత్ర విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వరకు సాగనుంది. భారీగా మహిళా రైతులు పాదయాత్ర లో పాల్గొన్నారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో పొంగల్లు పెట్టి పాదయాత్రను ప్రారంభిస్తూ,అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని తాము చేస్తున్న పాదయాత్రకు సహకరించాలని పోలీసులను రైతులు అభ్యర్థిస్తున్నారు.
గతంలో పోలీసుల దాష్టికం కారణంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ఆగిపోయిందని దానికి కొనసాగింపుగా ఈ పాదయాత్ర చేయనున్నట్లు మహిళా రైతులు చెబుతున్నారు.