గోడ మీద వార్తలు

01 .  CAB కు వ్యతిరేకంగా పలు నగరాల్లో నిరసనలు – కొన్ని చోట్ల చేయి దాటిపోయిన పరిస్థితులు …

ఎదవలకి కొదవలేదనీ – తినే కంచంలో మన్నుపోస్కునేటోళ్ళు – ఉన్న ఇంటికి నిప్పెట్టు కునేటోళ్ళు చాలా మందే ఉన్నట్టున్నారే…!!

02. ఆవులకి బ్లాంకెట్లు కొనిచ్చినా – మొక్కలు నాటి సెల్ఫీలు పంపినా తుపాకీ లైసెన్సులిస్తాం – మధ్యప్రదేశ్ అధికారులు …

తొక్కలో తుపాకీలేం సరిపోతాయి గానీ – గ్రనేడ్లు – ఆటం బాంబులు తయార్చేస్కోటానికి కుటీర పరిశ్రమల లైసెన్సులియ్యండి శనొదిలి పోద్ది…!!

03. పౌరసత్వ బిల్లుపై జరుగుతున్న ఆందోళన వెనుక కాంగ్రేస్ మరియు దాని మిత్ర పక్షాల హస్తం ఉంది – మోడీ …

రేయ్ రేయ్ – ఇయాల సోమారం నిన్న ఆదోరం అని సెప్పండ్రా సామీ – మాయ్యకి ప్రతిరోజూ మంగళారంలానే ఆన్తన్నట్టుంది…!!

04. ఉల్లి పంటను సాగుచేసి అత్యధిక దిగుబడి రావటంతో ఒక్కసారిగా కోటీశ్వరుడైన – కర్ణాటక రైతు …

సామి స్టేట్లో ఉన్న నక్కలన్నింటినీ క్యూలో నిలబెట్టి తోకలపై తొక్కుడు బిల్ల ఆడుంటాడు  …!!

05. నేతలు పార్టీ మారినా కార్యకర్తలింకా పార్టీతోనే ఉన్నారు – తెలంగాణలో తెదేపాకి తిరిగి పూర్వవైభవం వస్తుంది – చంద్రబాబు …

జోకు పాతదే అయినా…. విన్న ప్రతిసారీ పగలబడి నవ్వేట్టు చేస్తాది సామీ – దాని రేంజు అట్టాంటిది మరి…!!

Leave a Reply

Your email address will not be published.