పర్యావరణ ప్రియుడు ఆ హీరో…
సినీ నటుల పెళ్లి అంటే హంగూ ఆర్భాటం వేరేగా ఉంటుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందునా శుభలేఖలు విషయానికి వచ్చేసరికి లక్షల్లో ఖర్చు చేసి, అందమైన బహుమతులు జతచేసి అతిధులకు ఆహ్వానం పలకటం కద్దు. అయితే కన్నడ సినీ హీరో చేతన్ మాత్రం ఇందుకు భిన్నంగా తన పెళ్లి నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించాడు .
తన వివాహానికి ముహూర్తం ఖరారైన రోజునుంచి ఎలా చేయాలని ఆలోచించాడు. తన పెళ్లి ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్న తలంపు రావటమే తడవు.. తన పెళ్లి శుభలేఖల్లో విత్తనాలు (సీడ్ బాల్) ఏర్పాటు చేయించి.. బంధుమిత్రులను ఆహ్వానించాడు. శుభలేఖను అనువైన ప్రాంతంలో వేస్తే మొలకెత్తి.. చెట్టుగా మారి పర్యావరణానికి మేలు చేస్తుందని చెబుతు వారందరికీ అవగాహన కలిగిస్తున్నాడు.