అర్థ శతకం వెనక కథ ఇదీ! – శ్రీహర్ష

పాతికేళ్ల వయసులో ఉద్యోగం లేకపోతే యూత్ ఎలా బతుకుతారు? అనేదే మా సినిమా. ఈ జనరేషన్  ఎలా ఉంది అనేది  సినిమాలో చూపించాం. సినిమాలో నాలుగు పాత్రల్లో ఏదో ఒక పాత్రకు జనం కనెక్టవుతారని అనుకున్నాం. అదే జరిగింది. అందుకే ఈ విజయం.. 50రోజుల ఉత్సాహం నేను కనపడితే గుర్తుపట్టి మరీ అడుగుతున్నారు. ఎలా కనెక్ట్ అయ్యారో నాతో చెబుతున్నారు. ప్రేక్షకులే తర్వాతి స్థాయికి తీసుకెళ్లారు… అని అన్నారు శ్రీహర్ష కోనుగంటి. ఈ యువదర్శకుడు రూపొందించిన హుషారు ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే తారాగణం.  బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలు. ఈ శుక్రవారంతో 50రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ  సందర్భ ంగా దర్శకుడు పాత్రికేయులతో ముచ్చటించారు. 
30 థియేటర్లకు వెళుతున్నాం
ఈ రోజుల్లో 50 రోజులను సినిమా చేరడం కష్టమే. మా హుషారు ఈ శుక్రవారంతో 50 రోజులను పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆ రోజున ఓ ఈవెంట్ నిర్వహించి సినిమా ప్రదర్శిస్తున్న 30 థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలుస్తాం.  యూత్ టార్గెట్గా తీసిన చిత్రమిది. వారికి చేరితే చాలనుకున్నాం. బాగా కనెక్ట్ అయ్యి ఎక్కువ సార్లు చూసినవాళ్లు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వచ్చింది. 
ప్రశంసలు దక్కాయి
పరిశ్రమ ప్రముఖులు చాలా మంది సినిమా చూసి ప్రశంసించారు. పెద్ద సినిమాలను తట్టుకుని ముందుకు రావడంతో సినిమాలో కంటెంట్ ఉందని అంతా మెచ్చుకున్నారు. ఇక మూవీలో ఎన్నో హైలైట్స్ ఉన్నా  ఉండిపోరాదే హైలైట్ అయ్యింది. ఆ పాటకు  ముందు వేరే ఆలోచన ఉండేది. అయితే కథానుగుణంగా నాయికకు హీరో స్ర్పజ్ ఇద్దామనుకుంటాడు. అందులో భాగంగా అమెరికా వెళ్లాలనుకున్న హీరోయిన్తో హీరో మనం ఇక్కడే ఉండిపోదాం. నేను చాలా బాగా చూసుకుంటాను.. అనే.. సందర్భానికి రధన్ ట్యూన్ ఫెంటాస్టిక్. సిధ్ శ్రీరాం ఆ ట్యూన్‌కు చక్కని గాత్రాన్ని ఇచ్చారు. ఈ పాట చాలా బావుందని అల్లు అర్జున్ ట్వీట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ పాటకు శాడ్ వెర్షనూ చాలా పెద్ద హిట్టయ్యింది. ఈ కాలంలో జనాల్ని థియేటర్లకు రప్పించడం కష్టమే. కొత్త పాయింట్ అయితేనే వస్తున్నారు. 
రీమేక్ చేస్తున్నారు
ఈ బ్లాక్ బస్టర్ ని ఇప్పుడు తమిళం, హిందీలో రీమేక్ చేస్తున్నారు. నన్ను డైరెక్ట్ చేయమని అన్నారు. కానీ కుదరలేదు. 
తదుపరి రెండు సినిమా కథలను రాస్తున్నాను. పెద్ద బ్యానర్స్‌లో పనిచేయనున్నా. రెండు కథల్లో ఒకటి పూర్తి పాజిటివ్ స్టోరి.
బడ్జెట్ ఎక్కువే ..
హుషారు కు మేం అనుకున్న బడ్జెట్ తక్కువే. అయితే ఆ బడ్జెట్ కూడా అనుకున్న దాని కంటే ఎక్కువే. ఆ బడ్జెట్ను నిర్మాతగారు నెమ్మదిగా తెచ్చారు. నెలకు ఐదు రోజులే షూట్ చేశాం.

Leave a Reply

Your email address will not be published.