శంకర్ గొప్పవాడా? రాజమౌళి గొప్పవాడా ?

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అని అనుకుంటున్న తరుణంలో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తమిళ సినిమా స్థాయిని ఏపాటిదో చాటుతూ జెంటిల్‌మేన్, ఒక్కడున్నాడు, ఇండియన్, జీన్స్, రోబో ఇలా వరుస విజయాలందుకున్న శంకర్ హాలీవుడ్ స్థాయి మేకింగ్ వేల్యూస్ తీసిపోని తీరుగా తీయగలనని నిరూపించుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు.
అయితే ఇప్పుడు శంకర్ స్థాయిని మించేలా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వరుస సినిమాలు సాంకేతికతని వినియోగిం చుకుటూ తీయటంతో పాటు తెలుగు సినిమా, అందునా బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమానే ఉర్రూతలూగించి .తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటాడు అనటంలో సందేహం లేదు.
ఈ మధ్య ఓ వెబ్ ఛానల్ సాంకేతికత విషయంలో దక్షిణాదిన శంకర్ గొప్పవాడా? రాజమౌళి గొప్పవాడా ? అనే వాదన తెరపైకి తీసుకువచ్చి ఓటింగ్ పెడితే రాజమౌళి టాప్‌లో నిలవటం గమనార్హం. తాజాగా. శంకర్‌ను మించి పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలోశంకర్ సైతం మరోమారు `ఇండియన్ 2` తో ఈ ఏడాది ద్వితీయార్థంలో సందడి చేయాలని అనుకున్న కొన్ని కారణాలతో షూటింగ్ ఆగిపోవటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నట్టు తెలియవస్తోంది. .
రాజమౌళి తన `ఆర్ఆర్ఆర్` సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అనుకోని షాక్‌తో శంకర్ సతమతమవుతున్నాడని సమాచారం. ఇందుకు ప్రధానంగా తన సినిమాలకు ఉన్న తెలుగు మార్కెట్ లో ధియేటర్ల సమస్య వచ్చిపడే ఆస్కారం ఉందని భావించిన శంకర్ `ఇండియన్ 2`ను మరికొంత వెనక్కి తీసుకెళ్లక తప్పేలా లేదని పరిశ్రమ వర్గాల మాట. మరి ఏం జరగనుందో చూడాలి.
అయితే శంకర్ ఆలోచనలకు రాజమౌళి బ్రేకులేశాడు. ఎందుకంటే ఆయన కంటే ముందుగానే దీంతో ఇప్పుడు శంకర్‌కు పెద్ద సమస్యే వచ్చి పడింది. రాజమౌళి సినిమాతో తన సినిమాను విడుదల చేయలేడు. అక్కడే