మానవ మృగాలకు కఠిన శిక్షలు విధించండి ….పవన్

యత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని మాట్లాడుకోవటానికే తప్ప ఆచరణలోకి తీసుకు రావటం లేదని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేసారు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో జరిగిన వైద్యురాలు ప్రియాంక హత్యోదంతం తననుకలచివేసినదని ప్రియాంక మానవ మృగాలకు బలైపోయిందని ఇప్పుడు శంషాబాద్ ఘటనే కాదు కొద్దిరోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఆడుకొంటున్న ఒక చిన్నారిని ఒక దుర్మార్గుడు చిదిమేసాడని వరంగల్ లో ఓక విద్యార్థిని ని ఒక కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడని నిర్భయ చట్టం ఉన్నా మానవ మృగాలు నిర్భయంగా యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిని బహిరంగంగా కఠిన శిక్షలు విధించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
పోలీస్ శాఖ శివారు ప్రాంతాలలో గస్తీ పెంచి ‘షీ’ టీమ్స్ ని బలోపేతం చెయ్యాలని యువతులలో ఆత్మస్థైర్యం పెంచాలని వారి ప్రాణ రక్షణకోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం ఉందని పవన్
తెలిపారు, ప్రియాంక కుటుంబ సబ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈప్రకటన విడుదల చేసారు .