తాగి డ్రైవింగ్ చేయొద్దు.. కనెక్టయ్యింది!!

‘అక్కడొకడుంటాడు’ చిత్రానికి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోందని చిత్రబృందం వెల్లడించింది. శివ కంఠంనేని టైటిల్ పాత్రలో రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞదీపిక హీరోహీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో లైట్ హౌస్ సినీమ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగిన సక్సెస్ మీట్‌లోటైటిల్ పాత్రధారి శివ కంఠంనేని మాట్లాడుతూ చక్కని సమీక్షలు రావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం అందరికీ నచ్చిందని అన్నారు. థియేటర్ల పరంగా సి.కళ్యాణ్ సాయానికి ధన్యవాదాలు తెలిపారు. నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రమిదని దర్శకుడు శ్రీపాద విశ్వక్ తెలిపారుఉ. నిర్మాతలలో ఒకరైన రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మా బేనర్లో చేసిన మొదటి ప్రయత్నానికి విమర్శకుల ప్రశంసలు దక్కడం ఆనందాన్నిచ్చింది అన్నారు.

Leave a Reply

Your email address will not be published.