రాశిఫ‌లాలు,


మేషం – ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులు వంటివి సంభవిస్తాయి. మీ దైనందిన అలవాట్లలో మార్పులు, చేర్పులు ఎంతైనా అవసరం. కొన్ని అనుకోని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
 
వృషభం – ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. వాస్తవానికి మీరు చాలా నిదానస్తులైనప్పటికీ ప్రేమ మిమ్మల్ని ఉత్సాహవంతులుగా మారుస్తుంది. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ ఔదార్యాన్ని పరీక్షించ్ సమస్యలు ఎదురవ్వచ్చు. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు.
 
మిథునం – వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. ఎంతటి క్లిష్ట సమస్యైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు.
 
కర్కాటకం- విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు ఊరట కలిగిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు, ఇబ్బందులను ఎదుర్కుంటారు. పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

సింహం – కుటుంబ వ్యవహారాల కారణంగా మనస్తాపానికి గురవుతారు. కష్ట సమయంలో మిత్రులు సహకరిస్తారు. ఫ్యాన్సీ, కిరాణ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చితాతులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వాయిదా పడతాయి.
 
కన్య – బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. అత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులు సైతం మీ ఔన్యత్యాన్ని గుర్తిస్తారు. వృత్తుల వారికి అన్నివిధాల కలిసి వస్తుంది. ఎదుటివారిని అతిగా విశ్వసించి భంగపాటుకు గురవుతారు. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు.
 
తుల – మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. గృహంలో మరమ్మతులలో వ్యయం మీ అంచనాలను దాటుతుంది. స్త్రీలకు పనిభారం, చికాకులు అధికం. దైవ కార్యాలకు సహకరిస్తారు. ప్రయాణాలు ఆశించినంత ఉత్సాహంగా సాగవు.
 
వృశ్చికం – పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కొంత మొత్తమైనా పొదుపు చేయాలనే మీకోరిక ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చిస్తారు.
 
ధనస్సు – నూతన వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. అపరిచిత వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించిండి. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
మకరం – స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ఓర్పు, పనితనానికి ఇది పరీక్షా సమయం. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
  
కుంభం -ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. ప్రింటింగ్ రంగాలలోని వారికి సామాన్యం. వాహనం అమర్చుకుంటారు.
 
 మీనం- చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఆశాజనకం. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు ఊరట చెందుతారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది.
రాశిచక్ర అంచనాలు

Leave a Reply

Your email address will not be published.