గోవా అంటే అంత ఇష్టమా ఈ ముద్దుగుమ్మకి.?


చిత్ర సీమ‌కు వ‌చ్చింది మొద‌లు త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త నిలుపుకునే పాత్ర‌ల‌లో న‌టిస్తూ వ‌స్తున్న స‌మంత తాజాగా సొంత ఇల్లు క‌ట్టుకునే ప్లాన్‌లో ప‌డిందంటూ పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా..  ఏ సంతోషకరమైన సందర్భమైనా గోవాలోనే జ‌రుపుకునేలా ప్లాన్ చేసుకునే అ అమ్మ‌డు ప‌దే ప‌దే  తన భర్త నాగచైతన్యని తీసుకుని ఎప్పుడు ప‌డితే అప్పుడు గోవాకి చెక్కేస్తుంటుంది. విదేశాల క‌న్నా త‌న‌కు ఇక్క‌డి   సముద్రతీరంలో గ‌డప‌డ‌మే చాలా  సంతోషకరమైన క్షణాల‌ని చెప్పుకుంటుంది ఎప్పుడూ.

ఇలాంటి చోట  ఓ సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటుందట ఈ అక్కినేని వారి ఇంటి కోడలు సమంత. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, ఐశ్వర్యలకు అక్కడ విల్లాలు ఉంటం, వాటి ప‌రిశీలించి స‌మంతా వారిలా త‌మ‌కు కూడా సకల సౌకర్యాలతో ఇల్లు ఉంటే బాగుంటుంద‌ని భావించి త‌న సినిమాల‌తో వ‌చ్చే సొమ్ముతోనే దీనిని క‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు అప్పుడే అరంభించిన‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో విన‌వ‌స్తున్న మాట‌. ఇప్ప‌టికే స‌మంతా కుటుంబ స‌భ్యులు స్థ‌ల అన్వేష‌ణ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇంటికి శంఖుస్థాప‌న చేయ‌టంతో పాటు శ‌ర‌వేగంగా నిర్మించేసిత‌న‌ భర్తతో కలిసి గోవాకు వెళ్లిన‌ప్పుడు ఆ ఇంట్లోనే మ‌కాం పెట్టాల‌న్న యోచ‌న‌లో ఉంద‌ట స‌మంతా.  ఎనీ హౌ ఆల్‌ది బెస్ట్ అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

Leave a Reply

Your email address will not be published.