ఎన్టీఆర్ కోసం ఇళ్లు వ‌దిలి వ‌చ్చేసిన డైరెక్ట‌ర్‌… ఎందుకంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో తారక్ దూసుకుపోతున్నాడు. వసూళ్ళ విషయంలో కూడా తారక్ ఈ మధ్య దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో దర్శక నిర్మాతలు అతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో అతను ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో కొమరం భీం గా నటిస్తున్నాడు తారక్.

ఇక ఈ సినిమా కోసం ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి మరీ పని చేస్తున్నాడు యంగ్ టైగర్. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే ఒక తమిళ దర్శకుడు తారక్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. గత పది రోజుల నుంచి ఆ దర్శకుడు హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కథ ను కూడా తారక్ కోసం సిద్దం చేసాడని సమాచార౦. ఈ సినిమా తర్వాత తారక్ ఏ సినిమా చేస్తాడు అనేది క్లారిటి లేదు. దీనితో అతను ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే తారక్ కి రాయబారం కూడా పంపగా తాను షూటింగ్ లో ఉన్నా అని హైదరాబాద్ ఈ నెల ఆఖర్లో వస్తా అని చెప్పాడట. దీనితో అతను తారక్ ని కలిసే వెళ్తా అని చెప్పినట్టు తెలుస్తుంది. ఒక ప్రముఖ నిర్మాతతో కూడా ఆ దర్శకుడు తన పరిచయాలతో మాట్లాడినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను అన్ని అనుకున్నట్టు జరిగితే మొదలుపెట్టాలని భావిస్తున్నాడట. తారక్ ప్రస్తుతం కథలు కూడా వినకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడని ఈ సినిమా తర్వాతే ఏ సినిమా అయినా అనే పట్టుదలగా ఉన్నాడట.  మొత్తానికి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి రాజ‌మౌళి సినిమా పూర్త‌వ‌గానే వ‌రుస‌గా ద‌ర్శ‌కులు క్యూ క‌ట్టార‌న‌మాట మ‌రి ఎన్టీఆర్ ఎవ‌రికి ముందు అవ‌కాశం ఇస్టాడో వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.