హేజా సినిమాను సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు – హీరో, డైరెక్టర్ మున్న కాశీ


పాపులర్ మ్యూజిక్ కంపోజర్ మున్నా కాశి స్వీయ దర్శకత్వంలో హారర్ జోనర్ లో రూపొందిన చిత్రం హేజా. ప్రోమోలతోనే అందరి దృష్టిని ఆకర్షించి ఒక విభిన్నమైన హారర్ థ్రిల్లర్ అనిపించిన హేజా చిత్రం విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో డైరెక్టర్ మున్న కాశీ మాట్లాడుతూ….
సినిమాను ఆడియన్స్ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ గా ఉన్నాయని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మంచి సినిమాకు మరిన్ని థియేటర్స్ దొరికితే బాగుంటుందని భావిస్తున్నాను, ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది. హేజా సినిమా రివ్యూలు అన్ని బాగున్నాయి, బుక్ మై షో లో 90 శాతం పైగా రేటింగ్ ఉంది, ఇది చాలు మా సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పడానికి. రాబోయే రోజుల్లో సినిమాకు థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను మౌత్ టాక్ తో ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత వి.ఎన్ ఓలేటి మాట్లాడుతూ…
హేజా సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. థియేటర్స్ కొరత ఉంది, మంచి సినిమాను ఎక్కువ మంది ఆడియన్స్ కు అందచెయ్యలేక పోతున్నామన్న వెలితి ఉంది, కానీ త్వరలో మాకు ఆ సమస్య తీరుతుందని అనుకుంటున్నాను. థియేటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు మా సినిమాను ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికి థాంక్స్ తెలిపారు.

హీరోయిన్ లిజీ గోపాల్ మాట్లాడుతూ…
నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మున్న కాశీ గారికి అలాగే నిర్మాత ఓలేటి గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఆడియన్స్ సినిమా చూసి బాగుందని అంటున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. హేజా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.

ఆర్టిస్ట్ & లిరిక్ రైటర్  ప్రఫుల్ కుమార్ మాట్లాడుతూ…
మున్న కాశీ గారితో నటించడమే కాకుండా ఈ సినిమా కోసం ఒక పాట రాయడం జరిగింది. ఫస్ట్ షో నుండి హేజా మూవీకి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. భవిషత్తులో మున్న గారితో కిలిసి మరిన్ని సినిమాలు చెయ్యాలని భావిస్తున్నాను అన్నారు.

ఆర్టిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ…
నిర్మాత ఓలేటి గారు కష్టపడి ఈ సినిమా తీశారు, అందుకు ప్రతిఫలంగా సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. నా పాత్రకు  మంచి రెస్పాన్స్ లభిస్తోంది. డైరెక్టర్ గా హీరోగా మున్న కాశీ ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో బాగున్నాయని ఆడియన్స్ అంటున్నారు. ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.


Leave a Reply

Your email address will not be published.