మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుందని

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుందని టిటిడి ప్రకటించింది. ఈ మేరకు సోమవారం టిటిడి ప్రజా సమాచార అధికారి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసారు. రేపు రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు.
కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతిస్తారు.
ఇక శ్రీవారి గరుడ వాహన సేవకువిచ్చేసే భక్తుల కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలను, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశారు. అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు.