రాజధాని పై ఓటింగ్ నిర్వహించండి వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా……..


టీడీపీ ప్రభుత్వం ప్ర‌జా రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు విప‌క్ష నేత జ‌గ‌న్‌తో స‌హా రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకున్నారని కానీ ఇప్పుడు మూడు ముక్క‌లు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కారు సిద్దం కావ‌టం తెలుగు ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేయ‌ట‌మేన‌ని అన్నారు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుత స‌ర్కారు తీరు కార‌ణంగా ఏపీకి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పిన కార‌ణాలు వాస్త‌వ‌మేన‌ని, మూడు రాజధానులు తమకే లాభమంటూ తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు వ్యాఖ్యలు కూడా అక్ష‌ర స‌త్యాల‌ని అన్నారు. 

రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే వైసీపీకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకు అనుకూలంగా తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోవాల‌న్న డిమాండ్ రాష్ట్రంలో వినిపిస్తోంది. రాజధానిపై ఓటింగ్‌ నిర్వహించి అమరావతా? విశాఖ? అన్నది తేల్చాలి” అని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్‌ విసిరారు. తాను కష్టపడేది భావితరాల కోసమేనని, వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా అని ఆయ‌న పేర్కొన్నారు. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీలు రిపోర్టులు బోగస్‌ రిపోర్టులని.. వాటిని భోగి మంటల్లో వేసి చలికాచుకోవాలని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published.