ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో బాల‌య్య‌…


ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రం అనంత‌రం పూర్తి రాజ‌కియాల‌తో బిజీ అయ్యారు బాల‌య్య. ఈ మ‌ధ్య‌నే కే.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూర‌ల్ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చేసే ఈ 105వ చిత్రం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అందుకు త‌గిన‌ట్లుగానే బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా ట్రెండ్‌కి త‌గ్గ‌ట్లు చైనా గ‌డ్డంతో ప్రేక్ష‌కుల‌ను షాక్ కు గురిచేస్తున్నారు బాల‌య్య‌. ఈ చిత్ర షూటింగ్  అంతా దాదాపుగా థాయిల్యాండ్‌లో జ‌రిగింది. ఈ చిత్రం సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇక  చిత్ర ట్రైల‌ర్ కు అదిరిపోయే వ్యూస్ వ‌స్తున్నాయి. అంతే కాక ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన బాల‌య్య స్టిల్స్ అన్నిటికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. గ‌తంలో ఎప్పుడూ బాల‌య్య పోస్ట‌ర్స్‌కి కాని లుక్స్‌కి కాని ఇంత రెస్పాన్స్ రాలేదు. ఇక‌పోతే బాల‌య్య కుర్ర‌హీరోల‌కు ధీటుగా సన్న‌గా చాలా హ్యాండ్‌స‌మ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. లుక్ చూసిన ప్రేక్ష‌కులంతా కూడా సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వ్వుద్దా అని ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాల‌య్య అదిరిపోయే రెమ్యూనిరేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఇంత మొత్తంలో రెమ్యూనిరేషన్ గ‌త చిత్రాలు వేటికి తీసుకోలేద‌ని నిజానికి ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ నాలుగు నుంచి ఐదు కోట్ల వ‌రకు తీసుకుంటే ఈ చిత్రంకోసం మాత్రం ఆయ‌న ఏకంగా 10కోట్లు తీసుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. బాల‌య్య గ‌త చిత్రాలు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు బాక్సాఫీస్ ముందు ఎలాంటి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఆ చిత్రాలు హిట్ అయి ఉంటే క‌నుక ఇప్పుడు ఇచ్చే రెమ్యూన‌రేష‌న్ పై ఎవ‌రికి ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌చ్చేవి కావు కానీ ఇప్పుడు ఈ విష‌యం విన్న ప్ర‌తి ఒక్క‌రికి కొంచం షాకింగ్‌గానే ఉందని చెప్పాలి. ఇప్ప‌టికే కొత్త గెట‌ప్‌తో ఐర‌న్ మ్యాన్ స్టైల్ గెట‌ప్‌తో అంద‌ర్నీ ఆక‌ర్షించిన బాల‌య్య ఈ చిత్రంలో సోనాలీ చౌహ‌న్‌, వేదిక‌ల‌తో రొమాన్స్ చేస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన జైసింహ చిత్రం హిట్ కావ‌డంతో ఈ చిత్రం కూడా మంచి విజ‌యాన్ని సాధిస్తుందని నంద‌మూరి అభిమానులు అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published.