‘ఉమెన్ క్రూ’ సర్వీసు ట్రయిల్ రన్

ఆకాశంలో సగం, అవనిలో సగం అనే మహిళల కోసం ప్రత్యేక రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి విజయవాడ-గూడూరు మధ్య నడిచే ‘ఉమెన్ క్రూ’ సర్వీసు ట్రయిల్ రన్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు మొత్తం మహిళా సిబ్బందితో నడిచే ఉమెన్ క్రూ రైలు కోసం తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసారు. విజయవాడ-గూడూరు మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ త్వరలో అమలు లోకి రానుంది.
ఈ విజయవాడ నుంచి నడిచే ఇంటర్ సిటీలో పైలట్, అసిస్టెంట్ లోకో పైలెట్, గార్డు, టీటీ, ఆర్పీఎఫ్, స్వీపర్లు ఇలా అంతా మహిళా ఉద్యోగులే ఉంటారు.. దీనికోసం మహిళా క్రూను ప్రత్యేకంగా కేటాయించాలని విజయవాడ డీఆర్ఎం పి.శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్లో మహిళా క్రూతో కొంతదూరం నడిపించటానికి ట్రయల్ రన్ నిర్వహించారు.