సినిమాకి సై… పెళ్ళికి నై…?


‘ఈశ్వర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా…‘బుజ్జిగాడు’తో మాస్ హీరోగా అలరించి…‘బాహుబలి’తో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్. బాహుబలి సిరీస్‌తో భారతీయ ప్రేక్షకులతో సాహో అనిపించిన ప్రభాస్…1979 అక్టోబర్ 23న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తురులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. 2002లో కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది .ఆ తర్వాత ‘అడవిరాముడు’, ‘చక్రం’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ‘చక్రం’ మూవీతో డిఫరెంట్ మూవీస్ చేయగలడు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రభాస్.


ప్రభాస్ సినీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘చత్రపతి’. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు..సంభాషణలు, భావోద్వేగాలు, హాస్యం, నటన, శృంగారం, సెంటిమెంట్, మాస్‌లుక్ ఇలా భిన్న పార్శాల కలయిక ఈ చిత్రం. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న‌  శ్రేయ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రభాస్ సినీజీవితంలోనే భారీ విజయంగా నిలిచింది. ‘పౌర్ణమి’లో క్లాస్ క్యారెక్టర్, ‘యోగి’లో మదర్  సెంటిమెంట్‌తో కలిపిన యాక్షన్, ‘మున్నా’లో వెరైటీ యాక్షన్, ‘బుజ్జిగాడు’లో ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో పాటు కామెడీని పండించాడు. ‘డార్లింగ్’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఇలా ఏ సినిమాకైనా రెడీ అంటున్న డార్లింగ్ ప్ర‌భాస్ కి లేడీ ఫ్యాన్స్ కూడా కాస్త ఎక్కువే. ప్ర‌భాస్ అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు అనే చెప్పాలి.


ఇక సినీ కెరియ‌ర్ ఇలా ఉంటే…టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ పాపుల్ బ్యాచ్‌ల‌ర్ ప్ర‌భాస్ అనే చెప్పాలి. ఏ ర‌క‌మైన పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించే ప్ర‌భాస్‌.. పెళ్ళి విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. సినీ కెరియ‌ర్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తూ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని కూడా ప‌క్క‌న పెడుతున్నాడ‌నిపిస్తుంది. ‘బాహుబలి’కి నచ్చే ‘దేవసేన’ ఎక్కడుందో కాని.. ప్రభాస్ మాత్రం ఫైటింగ్‌లే తప్ప పప్పన్నం ఇప్పట్లో పెట్టేలా కనిపించడం లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేరే ఈ మిస్టర్ పర్ఫెక్ట్‌కి బాగా సూట్ అయ్యిందని.. పెళ్లి చేసుకుని ఆ పేరుని చెరిపేసుకోవడం ఇష్టం లేకనో ఏమో కాని.. తన తోటి స్టార్ హీరోలు.. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, పెళ్లి చేసుకుని భార్యలతో కలిసి ఎంచక్కా ఫారిన్ ట్రిప్పులేస్తుంటే మనోడు మాత్రం ఇంకా ‘డార్లింగ్’ అని పిలిపించుకోవడంతోనే సరిపెట్టేస్తున్నాడు. ఆయన ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా ప్రభాస్ పప్పన్నం పెడతాడని బాహుబలి రిలీజ్ అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. తీరా బాహుబలి వచ్చింది బొమ్మ హిట్ అయ్యింది.. ప్రభాస్‌కి నచ్చిన బొమ్మాలి మాత్రం ఇంకా సెర్చింగ్‌లోనే ఉండటంతో ప్రభాస్ పెద్దమ్మ (క్రిష్ణంరాజు భార్య శ్యామలా దేవి) ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.‘మీలాగే మేం కూడా ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం.. చాలా కాలంగా మావాడిని ఓ ఇంటి వాడిని చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాం. అని మీడియాకు ఓ చిన్న వార్త మాత్రం అందించా

Leave a Reply

Your email address will not be published.