ట్రాఫిక్ జామ్‌లు లేని రోజులు ఈ సంక్రాంతి మూడు రోజులే

ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ రోడ్డు చూసినా విశాలమైనంత అనుభూతి కలుగుతోంది. సిగ్నళ్ల వద్ద మినహా ఎక్కడా చక్రం ఆగని జర్నీ కానవస్తుండటం, రాజధాని వాసులు తెగ రిలాక్స్ కలుగుతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్లలో కబుర్లాడుకుంటున్నా గమ్యం చేరని బస్సులు ఇప్పుడు క్షణాలలో స్టేజీ దాటి పోతుండటంతో ఉలిక్కి పడుతూ స్టాప్ స్టాప్ అంటూ రిక్వెస్టు చేస్తూ, ఇంత తొందరగా గమ్యానికి చేరుకోవటం లాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. ‘సిటీ’జనులంతా ఊరటను ఆస్వాదిస్తున్నారిప్పుడు.
ఇసకేస్తే రాలనన్ని వాహనాల ఒత్తిడుండే నగరంలో గొప్ప సాంత్వన కూరటానికి కారణం గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతి వేడుకలే అని చెప్పాలి. ఏ పండుగకూ లభించనంతలా మహానగరం ట్రాఫిక్ ఫికర్లు తగ్గుముఖం పట్టడం పండగ సెలవులకు ఒక్క సారి మాత్రమే జరుగుతోంది. భోగి, సంక్రాంతి, కనుమల కోసం అనేకమంది స్వస్థలాలకు తరలి పోవటంతో అనేక సర్కిళ్లు బోసిపోతున్నాయి.
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగ సీజన్లో 408 స్పెషల్ రైళ్లను నడుపుతుంటంతో ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వెళుతన్న వారంతా సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లెక్కారు. ఇక ఆర్టీసీ, ప్రయివేటు బస్సులూ కిక్కిరిసిపో తున్నాయి. టీఎస్ ఆర్టీసీ దాదాపు 4,800 బస్సులను ప్రత్యేకంగా వేయగా ఏపిఎస్ ఆర్టీసీ మరి రెండు వేల బస్సులు ఏర్పాటు చేయటం విశేషం. ట్రాఫిక్ సిగ్నల్స్ల్ ఫ్రీ సిటీ గా రూపొందిస్తామని చెపుతున్న ప్రభుత్వం ఎంత చేస్తున్నా… ట్రాఫిక్ జామ్‌లు లేని రోజులు ఈ సంక్రాంతి మూడు రోజులే అనిపిస్తాయి. ఇలా హైదరాబాద్ రోడ్లు ఎపుడు రూపుదాల్చుతుందోనని జనం వేచి చూస్తోంది.