అమ్మ పాత్ర అనగానే గుర్తొచ్చేది రమ్యకృష్ణయేన …???

నిన్నటి తరం హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, అమ్మలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అందరికన్నా ముందు నిర్మాతలకు అమ్మ పాత్ర అనగానే గుర్తొచ్చేది రమ్య కృష్ణనే. గతంలో హలో సినిమాలో అఖిల్ కు తల్లి పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ… ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో విజయ్ దేవరకొండకు అమ్మగా నటిస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఈ సినిమాకు ఇప్పటికే ఫైటర్ గా టైటిల్ ఖరారు చేసిన విషయం విదితమే. తాజాగా ఈ మూవీలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణని ఎంపిక చేసినట్టు సమాచారం.
బాహుబలి లో రాజమాత శివగామిగా రానా తల్లిగా అదరగొట్టిన రమ్యకృష్ణ ఫైటర్ సినిమాలో విజయ్ కు తల్లి పాత్రలో కనిపించనున్నారన్న వార్తలు చిత్రానికి మరింత క్రేజ్ తెచ్చిపెడుతోంది. ఇక విజయ్ సరసన నటించేందుకు శ్రీదేవి కూతురు జాహ్నవిని సంప్రదించారని, భారీ పారితోషం ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్టు వస్తున్న కథనాలు కూడా చిత్రాన్ని తారా స్ధాయికి తీసుకెళ్తున్నాయి.
నాలుగు నెలల పాటు ముంబైలో ఫైటర్ సినిమా షూటింగ్ కోసం పూరీ జగన్నాధ్ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి అక్కడే ఓ భారీ సెట్ వేయటంతో పాటు, జనం మధ్య చేయాల్సిన సీన్ల కోసం
లొకేషన్లని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫైటర్ షూటింగ్ ముంబైలో పూర్తి కాగానే.. యూఎస్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేసారని తెలుస్తోంది. వేసవి నాటికి ఈ చిత్రం విడుదలయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.