లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి సినీ ఇండస్ట్రీలో సెకెండ్‌ ఇన్నింగ్స్దశాబ్ధ కాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినీ ఇండస్ట్రీలో సెకెండ్‌ ఇన్నింగ్స్ ఇస్తూ, అదరగొట్టిన రాములమ్మ ఇక రెండో సినిమా చేసేందుకు ముందు వెనుక ఆలోచించుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. సినిమా సక్సెస్‌తో మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని రాజకీయాలకు దూరమై, సినిమాలలో హ‌ల్‌చ‌ల్ చేయ‌టం కాయ‌మని వార్తలు వినిపిస్తున్న త‌రుణంలో ఆమె లేటెస్ట్‌గా ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ ఆమె చేసిన ట్వీట్ చూస్తుంటే రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు అర్థం అవుతోంది. వరుస ఆఫర్లు వస్తున్నా వాటిని సున్నితంగా తిరస్కరిస్తుంటానికి కూడా ఇదే ప్ర‌ధాన కార‌ణంగా ఇండ‌స్ట్రీలో విన‌వ‌స్తోంది.


Leave a Reply

Your email address will not be published.