దుమ్మురేపుతున్న దర్బార్

ఆరు పదుల వయసు దాటినా ఏ మాత్రం తగ్గకుండా యువ హీరోలకు పోటీ ఇస్తున్నరజనీ కాంత్, మురుగుదాస్ కాంబినేషన్లో దర్బార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 స్క్రీన్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నైజాంలో 250, సీడెడ్‌లో 140, ఏపీ 350 ఇలా మొత్తంగా విడుదలైన దర్భార్ తన హవా కొనసాగిస్తున్నట్టే కనిపిస్తోంది. పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఇలా అన్నీ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయటంతో అందుకు తగ్గట్టే సినిమా ఉండటం విశేషం.
కాగా సంక్రాంతి సీజన్ కావడంతో డబ్బింగ్ సినిమాకు సాధారణంగా థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. కానీ తెలుగు చిత్రాలు విడుదలకు మధ్యలో రెండు రోజులు గ్యాప్ రావడంతో దర్బార్‌కు భారీ మొత్తంలో థియేటర్లను కేటాయించడంతో ఈ రెండ్రోజులలోనే పెద్ద మొత్తం కొల్లడగొట్టేందుకు రజనీ సిద్దమవుతున్నాడు. రజినీ సినిమా అంటే తెలుగులోనూ మాస్ ఆడియన్స్‌కి ఉన్న క్రేజ్, ఏ ఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో ఈ సినిమాని చూసేందుకు క్యూలు కడుతున్నారు ప్రేక్షకులు. బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే. దాదాపు యాభై శాతం బుకింగ్స్ క్లోజ్ అయినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మొదటి రోజు దాదాపు రెండు నుంచి ఐదు కోట్లను రాబట్టే అవకాశముందని సినీ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 700 తెరల్లో విడుదల కావడం, దీనికి పోటీగా మరే చిత్రం విడుదల కాకపోవటం కూడా దర్బార్‌కి ప్లస్ అయ్యాయని చెప్పాలి.