దిశా కేసు సీన్ రీకనస్ట్రక్షన్ చేయనున్న అధికారులు

హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన దిశ హత్యాచార నిందితులకు తక్షణమే కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవలే కేసును వేగంగా విచారించి, నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన సంగతి మనకు విదితమే. ఈ క్రమంలో నిందితులను డాక్టర్ల చేత పోలీసులు పరీక్షలు చేయించి దిశా అత్యాచారం ఎలా జరిగుంటుందో అని ఇప్పటికే సీన్ రీకనస్ట్రక్షన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు గాను శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన నలుగురు అడిషినల్ ఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సై బృందం ఏర్పాటై అందుతులను ఘటన స్థలానికి తీసుకెళ్లి దిశ ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆమెను పెట్రోల్ పోసి కాల్చిన సమయం వరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే అంశంపై సీన్ టూ సీన్ మొత్తం నిందితుల దగ్గర నుంచి వివరాలను సేకరించేందుకు సీన్‌ను రీకన్స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్నారు.