కరోనా వైరస్ ఎఫెక్ట్ నుండి బయ్యర్ లను బయట పడేసిన ‘భీష్మ’

నితిన్ కెరీర్ కి బెస్ట్అయిన ‘అఆ’ కలెక్షన్లను ‘భీష్మ’ అధిగమిస్తుంది అని అంతా భావించినా డ్రై సీజన్ కి తోడు కరోనా వైరస్ ఎఫెక్ట్ సినిమా మీద బాగానే పడినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మొదటి వారం పూర్తయ్యేసరికే బ్రేక్ ఈవెన్ సాధించడంతో వరుసగా ప్లాప్ లతో సతమతమవుతోన్ననితిన్ కు ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తుందని అనుకున్నారంతా.
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగ్గా 20 రోజులతో 28.30 కోట్ల షేర్ ను వసూల్ చేయటంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్జోన్లోకి వెళ్లారు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో ధియేటర్లకి వచ్చేవారు తగ్గిపోవటంతో కలెక్షన్లలో దూసుకెళ్లలేక పోయింది. ఓవర్సీస్ లో ఈపాటికే 1 మిలియన్ దాటుతుంది అంతా అనుకుంటే.. అక్కడ కూడా కరోనా దెబ్బ పడింది . ఈ వారం కొత్త సినిమాలున్నా… భీష్మని కదిలించే ప్రయత్నాలు తక్కువగా ఉన్నాయి. దీంతో 1 మిలియన్ సాధించే అవకాశం ఉంది.
ఇక ఈ చిత్రం 20 రోజుల కలెక్షన్ల వివరాలు చూస్తే…
నైజాం 9.21 cr
సీడెడ్ 3.30 cr
ఉత్తరాంధ్ర 3.15 cr
ఈస్ట్ 1.77 cr
వెస్ట్ 1.32 cr
కృష్ణా 1.61 cr
గుంటూరు 1.88 cr
నెల్లూరు 0.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.93 cr
ఓవర్సీస్ 3.31 cr
వరల్డ్ వైడ్ టోటల్ 28.30 cr