అత‌డు గే… కానీ… అత్యాచారాలలో అగ్ర‌గామి



ఇండోనేసియాకు చెందిన 36 ఏళ్ళ రీనార్డ్ సినాగా అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యధికంగా అత్యాచారాలు, ఘోరాలు చేసినవాడిగా వార్తల్లోకి ఎక్కాడు. ఇండోనేసియాలో ఓ ధనిక కుటుంబానికి చెందిన ఇతడి నేర చరిత్ర గురించి తెలిసిన చాలా మంది నిర్ఘాంతపోతున్నారు. సుమారుగా 195 మంది పురుషుల మీద దాడులు, 136 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగ ఖంగు తిన్నారు. నిజానికి బ్రిటన్ లోని మాంచెస్టర్ నివాసిగా ఉంటున్న సినాగా ఒక గే..  ఇతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచినప్పుడు జడ్జి.. ‘ రాక్షసుడు ‘ అని అభివర్ణించారంటే ఇతగాని నేర చరిత్ర ఎలాంటిదో తెలుస్తోంది. ఎనిమిది అత్యాచార యత్నాలు, 48 మందిపై అసభ్య నేరాలకు కూడా పాల్పడిన సినాగా కు న్యాయమూర్తి 30 ఏళ్ళ జైలుశిక్ష విధించారు. నైట్ క్లబ్బులకు వెళ్ళినప్పుడు తాను టార్గెట్ చేసుకున్న వ్యక్తులకు సినాగా .. తన ఇంటికి ఆహ్వానించి వారికి  డ్రగ్స్ తో కూడిన మద్యాన్ని ఇచ్చేవాడని, అనంతరం వారిపై దాడులకు పాల్పడే వాడని తెలిసింది. తమ కొడుకు గే అని, సీరియల్ రేపిస్టు అని గానీ తెలియని ఇతని తలిదండ్రులు ఈ విషయాలు తెలిసి నిర్ఘాంతపోయారు. 2007 లో ఇండోనేసియా నుంచి బ్రిటన్ చేరుకున్న ఈ నేరస్థుడు మాంచెస్టర్ యూనివర్సిటీ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందాడట. అయితే ఎందుకో ఇలా మారిపోయాడు

Leave a Reply

Your email address will not be published.