మహారాష్ట్ర లోని ముంబైలో దారుణంమహారాష్ట్ర లోని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో సొంత తల్లిని చంపి ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. మహారాష్ట్ర లోని ముంబైలో నివాసం ఉంటున్న సోహెల్ షేక్ అనే అతను డిసెంబర్ 28వ తారీఖున… తాగి ఇంటికి వెళ్లాడు. దీంతో అతని తల్లి తాగవద్దని.. ఇప్పటికే అప్పులు అయ్యి ఇల్లు దివాలా తీసిందని మందలించింది. సోహెల్ తాగుడును భరించలేని అతని భార్య అప్పటికే పుట్టింటికి వెళ్లిపోయింది… తల్లి మందలించిందన్న కోపంతో ఊగిపోయిన సోహెల్… సుత్తెతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత సోహెల్ సృహ తప్పిపడిపోయాడు. తెల్లవారిలేచి చూసేసరికి చనిపోయిన తల్లి మృతదేహాన్ని చూసి సోహెల్ కు మతిపోయింది. ఆ షాక్ లో… దగ్గరలోని దర్గాకు వెళ్లాడు.. అనంతరం ఇంటికి వెళ్లి ఓ క్రైమ్ వీడియో చూశాడు. ఆ రిఫరెన్స్ తో అతని తల్లి మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికాడు. మొండెం నుంచి తలను వేరు చేసి నగరంలోని పలు చోట్ల పారవేశాడు. ఈ క్రమంలో చంపిన తర్వాత మృతదేశంతో అతను 36గంటలు గడిపాడు. డిసెంబర్ 30న విద్యావిహార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శరీరభాగాలను గుర్తించిన పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ మరుసటిరోజు మరికొన్ని బాడీ పార్ట్స్ సబర్జన్ ఏరియాలో ప్లాస్టిక్ కవర్ లో దొరికాయి. జనవరి 4న శాంతాక్లాజ్ చెంబూర్ లింక్ రోడ్డులో తల భాగం దొరికింది. అయితే అప్పటికే అవయవాలు కుళ్లిపోవడంతో స్కెచ్ గీయించడానికి వీలులేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. అవయవాలు దొరికిన ప్లేస్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బైక్ పై వచ్చిన వ్యక్తి కొన్ని కవర్ లను పడేసినట్లు గుర్తించారు. దీంతో సోహెల్ ను గుర్తించి విచారించగా.. అతని తల్లిని తానే హత్య చేసి నగరంలోని పలు చోట్ల పారవేసినట్లు ఒప్పుకున్నాడు. చంపేసిన తర్వాత అతని తల్లి శరీరంపై నుంచి బంగారు గాజులు తీసుకుని అమ్మివేసినట్టుగా తెలిపారు పోలీసులు. బంగారం అమ్మగా వచ్చిన 50వేల రూపాయలలో.. 25వేలను బార్ లో పని చేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చినట్లు చెప్పారు. అయితే వచ్చిన నగదుతో ఓ బైక్ ను కొన్నాడని దానిపై తిరుగుతూనే శరీరభాగాలను నగరం చుట్టూ విసిరేశాడని చెప్పారు పోలీసులు. సోహెల్ పై హత్యకేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.