కొత్త దర్శకుడి తో సాయి ధరమ్ తేజ్

శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్ . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్స్ డోస్ పెంచేందుకు రంగంసిద్దం చేస్తోంది చిత్ర యూనిట్ .
చిత్రలహరికి ముందు వరుసగా అపజయాలతో సతమతమైన సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో చేసిన ‘ప్రతి రోజు పండగేస హిట్‌తో ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన ఈ చిత్రం తదుపరి తన ఎనర్జీ మరోమారు చూపేలా సోలో బ్రతుకే సో బెటర్ లో నటిస్తున్నాడని యూనిట్ వర్గాల సమాచారం .. ఎస్.ఎస్.థమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెపుతున్నారు.
ఇప్పటికే మేడే నాడు చిత్రాన్ని విడుదల చేయటానికి అన్ని హంగులూ సమకూర్చుకుంటున్న చిత్ర నిర్మాతలు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్ప్స్ ని ఫిబ్రవరి 13 సాయంత్రం జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్‌లు కూడా అందించనున్నారని ఓ టాక్.