ఆ గిన్నిస్ విజేత గుండె ఆగింది

నేపాల్ ప్రభుత్వ గుడ్విల్ అంబాసిడర్,  గిన్నీస్‌ బుక్‌ రికార్డ్స్‌ లో స్థానం  అందుకున్న నేపాల్‌ వాసి ఖాగేంద్ర థాపా మాగర్ అనూహ్యంగా మృతి చెందాడు.2అడుగుల ఎత్తు మాత్రమే ఉండే మాగర్   ప్రపంచంలోనే చిన్న వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డుల్లోకెక్కారు. గ‌త కొంత కాలంగా న్యూమోనియా వ్యాధితో బాధ ప‌డుతున్న ఆయ‌న  పోఖారా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన‌ట్టు కుటుంబసభ్యులు మీడియాకు దృవీకరించారు. పుట్టినప్పుడు 600 గ్రాముల బరువు మాత్రమే ఉన్నఖాగేంద్రకు 27ఏళ్ల   వయసు వ‌చ్చినా ఎత్తు మాత్రం పెరగక పోవ‌టం విశేషం. ఇది జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌గా అప్ప‌టిలో వైద్యులు నిర్ధారించారు. కేవ‌లం ఎత్తు త‌క్కువ‌గా ఉండే వ్య‌క్తిగా గిన్నిస్‌లో స్థానం అందుకున్న గుడ్విల్‌ని అప్ప‌టిలో త‌మ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చారం కోసం నేపాల్ ప్ర‌భుత్వం అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకున్న విష‌యం విదిత‌మే.

Leave a Reply

Your email address will not be published.