మోడీ మ‌రో హిట్ల‌ర్‌- ప్ర‌కాష్ రాజ్‌
తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డం…. ఇలా  ఏ భాష‌లోనైనా ఫిట్ అయిపోయి, త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త నిరూపించుకుంటూ బ‌హు నటుడు గా పేరుతెచ్చుకున్న‌ ప్రకాశ్ రాజ్ ఈ మ‌ధ్య వివాదం రేకెత్తేలానే  తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా   సార్వత్రిక ఎన్నికలకు ముందు  ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేయ‌టంతోప్రకాశ్ రాజ్… బీజేపీ కేడర్ కు టార్గెట్ అయ్యారనే చెప్పాలి.   ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పార్టీల‌క‌తీతంగా పోటీకి దిగినా ఎన్నికల బరిలో  ఓటమి పాలు కావాల్సి వ‌చ్చింది.  దీంతో కాస్త సైలెం్ అయిపోయిన‌ట్టు క‌నిపించినా,  తాజాగా మ‌ళ్లీ  మోడీని టార్గెట్ చేస్తూ   సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 
ఈ సారి  ప్రధాని నరేంద్ర మోడీకి  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కి మ‌ధ్య పోలిక‌లున్నాయంటూ  ఇద్ద‌రి సారూప్య‌త‌ని  హిట్లర్ మోదీ ఫొటోలను అందించ‌డంతో పాటు వివిధ సందర్భాల్లో హిట్లర్ , మోడీలు ఎలా వ్యవహరించారో – ఎలా స్పందించారో – ఎలాంటి హావభావాలను పలికించారో… ఫొటోలను వెతికి మరీ  24 సెకన్ల నిడివి గల వీడియో రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో  హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.   మ‌రి ఈ వీడియోపై కమలనాథులు ఏ విధంగా  స్పందిస్తారో చూడాలి.  

Leave a Reply

Your email address will not be published.