గుల్బ‌ర్గాలో దారుణం… అక్క కోసం వ‌చ్చి చెల్లిని…?

ప్ర‌స్తుతం జ‌రిగే నేరాల‌కు ఒక హ‌ద్దు అదుపు అనేది లేకుండా పోతుంది. అందులోనూ మ‌హిళ‌ల పై అరాచ‌కాలు ఎక్కువ‌య్యాయి. ఇటీవ‌లె గుల్బ‌ర్గాలో ఇలాంటి దారుణ‌మే ఒకటి చోటుచేసుకుంది. అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన చెల్లెలి రేప్…. గుల్బర్గాలో పట్టుబడింది. హైదరాబాద్ నిజాంపేట‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైపు ‘దిశ’ ఘటనపై నగరంలో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పెషల్ టీమ్‌ ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

నిజాంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అక్కాచెల్లెళ్లు నివాసముంటున్నారు. వీరిలో అక్కకి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని నదిపాలేం గ్రామానికి చెందిన జయచంద్‌ (29) పరిచయం అయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు.  నవంబర్ 30వ తేదీన హైదరాబాద్ వచ్చి వారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లిడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన ఆమె చెల్లి ఒంటరిగా ఉంది.

ఈ విషయాన్ని పసిగట్టిన జయచంద్‌ ఆమెను బెదిరించి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న అక్క చెల్లెలి పరిస్థితి చూసి షాకైంది. బెడ్‌పై నగ్నంగా పడివున్న ఆమెను చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్న నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇక‌పోతే ఈ రోజుల్లో ఎవ‌రిని న‌మ్మాలో లేదో కూడా అర్ధం కాని నేప‌ధ్యంలో యువ‌త అందులోనూ ఆడ‌పిల్ల‌లు ఎవ‌రితో ప‌డితే వాళ్ళ‌తో ఫేస్‌బుక్‌, వాట్సాప్ చాట్‌లు, అలాగే మ్యాట్రిమోనియా లాంటివ‌న్నిటిని నమ్మ‌డం కూడా స‌రికాదు.


Leave a Reply

Your email address will not be published.