సేవింగ్స్ అకౌంట్‌దారులకు పోస్టల్ శాఖ షాక్సేవింగ్స్ అకౌంట్‌దారులకు  పోస్టల్ శాఖ పెద్ద‌ షాకిచ్చింది.  ఆయా ఖాతాల‌లో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని పెంచుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా  నోటిఫికేష్ జారీ చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు ఇక‌పై త‌మ అకౌంట్‌లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ  మినిమమ్ బ్యాలెన్స్  కేవలం రూ.50గా డుండ‌గా ఇప్పుడు దానిని ఏకంగా రూ.500 చేశారు. పైగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్   లేకపోతే జరిమానా కింద రూ.100 కట్ చేసుకుంటామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి ఏటా ఆర్థిక సంవత్సరం చివరి పని దినం రోజున ఈ పెనాల్టీ డబ్బు ఖాతాల నుంచి మిన‌హాయించుకుంటామ‌ని తెలిపింది.   

రూ.50 మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి వల్ల ఇండియా పోస్ట్‌కు ఏడాదికి రూ.2,800 కోట్లు నష్టం కలుగుతోందని పోస్ట‌ల్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఒకవేళ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో ఆర్థిక సంవత్సరం చివరి పని దినం రోజున జీరో బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు ఆ అకౌంట్ ఆటోమేటిక్‌గానే ముగిస్తామ‌ని పేర్కొన్నాయి. ఇప్ప‌టికే  కొత్త మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ విషయాన్ని సేవింగ్స్ ఖతాదారులకు తెలియజేయాలని పోస్టాఫీస్ డైరెక్టరేట్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.  

 పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ మొత్తానికి (ఏడాదిలో రూ.10,000 వరకు) ఎలాంటి పన్ను ఉండదని తెలుపుతూ,  ఇప్పుడు కొత్తగా ఎవరైనా పోస్టాఫీస్ అకౌంట్ తెరవాలంటే రూ.500  కేవలం క్యాష్ రూపంలోనే చెల్లించాల్సిన‌ప్పుడే అకౌంట్‌ను ఓపెన్ చేయగలుగ‌తామ‌ని తెలిపింది. దీనితో పాటు పోస్టాఫీస్ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక సారైనా   డబ్బులు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయడం చేయాలి. అప్పుడే అకౌంట్ పనిచేస్తుందని పోస్ట‌ల్ వ‌ర్గాలు చెపుతున్నాయి. వచ్చేసింది.

 

Leave a Reply

Your email address will not be published.