వాక్‌మేట్ త‌న ప్రచారకర్తగా నయనతార

ప్రముఖ పాద‌ర‌క్ష‌ల కంపెనీ వాక్‌మేట్ త‌న ప్రచారకర్తగా టాలీవుడ్‌ నటి నయనతారను ఎంపిక చేసుకుంది. ఈ మేర‌కు చెన్నైలో  నయనతారను క‌లుసుకున్న సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాస్టియన్‌ జోసెఫ్‌ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉత్త‌మ నాణ్య‌త‌గ‌ల పాద‌ర‌క్ష‌లు అందించే త‌మ సంస్ధ‌కు ప్రచారం చేసేందుకు ద‌క్షిణాది టాప్ హీరోయిన్ న‌య‌న‌తార అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. 
న‌య‌న‌తార కూడా న‌మ్మ‌ద‌గిన వాటికే త‌ను ప్రచార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, ఈ క్ర‌మంలోనే వాక్‌మేట్ సంస్ధ ఉత్ప‌త్తులు త‌ను వాడి, కొన్నాళ్లు ప‌రిశీలించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెప్పారు. 
కాగా గ‌తంలో ఈ వాక్‌మెట్‌కి మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. తదుప‌రి  ప్రముఖ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నియమితులయిన విష‌యం విదిత‌మే.   రానున్న కాలంలో దేశంలో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రచారకర్తగా నయనతారను ఈ బ్రాండ్‌ తయారీ కంపెనీ నియమించుకుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెపుతున్న మాట‌. 
 

Leave a Reply

Your email address will not be published.