‘సిగ్గుంటే రాజీనామా చెయ్యి’ ఆళ్ళకు సవాల్ విసిరిన తులసిరెడ్డి


రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలంటూ మంగళగిరి  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  తాడేపల్లి లో ర్యాలీ చేయడాన్ని తులసి రెడ్డి  తీవ్రంగా తప్పు పట్టారు ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొని వచ్చి రాజధాని ఈ ప్రాంతంలో ర్యాలీ చేయడానికి సిగ్గు ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సిగ్గుంటే రాజీనామా చేసి మూడు రాజధానులు కావాలంటూ చెప్పి మళ్ళి గెలవాలంటూ సవాల్ చేసారు. రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతి ప్రజల కోసం తమ పదవులకు రాజీనామా చేసి అమరావతి రైతులకు అండగా నిలవాలని కోరారు, అలా చేస్తే ప్రజలు తిరిగి భారీ మెజార్టీతో ఎన్నుకుంటారని లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పోరాడాలని సూచించారు.  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ రాజధాని అమరావతికి అంగీకరించారని  రాజధానికి 30,000 ఎకరాలు కావాలని చెప్పారని గుర్తు చేశారు మాట తప్పం మడమ తిప్పం అంటూ అధికారంలోకి రాగానే మాట తప్పారని తులసి రెడ్డి విమర్శించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని జగన్ పై మండిపడ్డారు.  

Leave a Reply

Your email address will not be published.