‘వరల్డ్ ఫేమస్ లవర్’తో రానున్న విజయ్ దేవరకొండ…..

సంచలన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై న‌టుడు కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు సమర్పిస్తుండ‌గా ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. క్రాంతిమాధవ్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న‌  ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లు గా న‌టిస్తుండ‌టం విశేషం. 
గోపీ సుందర్ సంగీతం అందించిన ఫస్ట్ సాంగ్ ‘మై లవ్’ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వినసొంపైన బాణీలు, రెహమాన్ ఆకట్టుకొనే సాహిత్యం, శ్రీకృష్ణ, రమ్యా బెహరా మధుర గానం జ‌త క‌ల‌య‌గా… నలుగురు హీరోయిన్లతోనూ  విజయ్ దేవరకొండ  ప్రేమ క‌థ‌నం   ఈ పాటలో కనిపిస్తుంది. కాగా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ చార్ట్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్ప‌టికే 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుండ‌టం విశేషం. మ‌రి ప్రేమిక‌ల రోజున ఇంకెంత సంద‌డి చేయ‌నున్నాడో దేవ‌ర‌కొండ‌. 

Leave a Reply

Your email address will not be published.