సినిమా హీరోల కి తప్పని అమరావతి సెగ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని హైదరాబాదులో జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి సంఘం ఏర్పడింది. ఈ విద్యార్థి జేఏసీ ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటి ముందు నిరసన దీక్ష మొదలు పెట్టారు. ఇంతేకాదు ఈ నెల 19 వరకు అందరి సినీ హీరోల ఇంటి ముందు ఇలాగే నిరసన దీక్షలు కొనసాగిస్తామని జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ తెలియజేసింది. తెలుగు హీరోలు అయి ఉండి తెలుగు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎవరు నోరు విప్పడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా కొనసాగించాలని సినిమా నటులందరూ రాజధాని రైతులకు మద్దతు తెలియజేయాలని జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఎస్వీబీసీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ రాజు ఇప్పటికే జగన్  నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు.దీంతో రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిలో భాగంగానే పోసాని కృష్ణమురళి పృథ్వీరాజ్ మాటలకు కౌంటర్ కూడా ఇచ్చారు.   అమరావతి రైతులకు క్షమాపణ కూడా చెప్పమని డిమాండ్ చేశారు.  ఈ నేపథ్యంలోనే జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఇప్పుడు సినీ హీరోల ఇంటి ముందు దీక్ష చేయాలనుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రాజధాని సెగ సినీ హీరోలు కూడా పాకింది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.