పవన్ కళ్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నాయకుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో ద్వారంపూడి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలపై ముందుగా మోహరించిన వైసిపి కార్యకర్తలు కర్రలు రాళ్లతో జనసేన కార్యకర్తలపై దాడి చేశారు ఈ దాడిలో లో పలువురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు ఈ లోపు అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాపై వైసిపి కార్యకర్తలు అమానుషంగా దాడి చేశారని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు ఈ దాడులకు నిరసనగా రాష్ట్రంలో పలుచోట్ల జనసేన కార్యకర్తలు ధర్నాలకు దిగుతున్నారు.