“న్యూ ఇండియా” ని నిర్మించడానికి కట్టుబడి ఉన్నాం —ప్రధాని

రానున్న రోజులలో భారతదేశం ప్రపంచం లో అతిపెద్ద 5వ ఆర్ధిక దేశం గా ఆవిర్భవించనుందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు శుక్రవారం న్యూఢిల్లీ లో జరిగిన భారత్ -దక్షిణాఫ్రికా వ్యాపార సదస్సు లో ఆయన మాట్లాడుతూ ఆర్ధిక రంగం లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల వలన దేశం లో పెట్టుబడుల రంగం మరింత ప్రగతి సాధిస్తుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం కొత్త భారతదేశం ను నిర్మించేందుకు కట్టుబడి ఉందని తద్వారా రానున్న తరానికి అన్ని విధాలా అనుకూలమైన వాతావరణ  పరిస్థితులు కల్పించేందుకు శత విధాలా కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

 2.6 ట్రిలియన్ డాలర్లను పరిగణలోకి తీసుకుంటే భారత దేశ ఆర్ధిక స్థితి గతులు అగ్ర దేశాలైన అమెరికా, చైనా,జపాన్, జర్మనీ,యుకె , తర్వాత స్తానం లో ఉన్న విషయాన్నీ మోదీ గుర్తు చేసారు. 
కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలం గా మేకిన్ ఇండియా డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా అమలు చేస్తున్న దేశవాళి తయారీ రంగాలలో విప్లవాత్మక మైన మార్పులతో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న విషయాన్నీ మోదీ ఈసందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా యుఎన్ సీ టీ ఏ డి రూపొందిచిన జాబితాలో నిర్దేశించిన ఎఫ్ డి ఐ ల విషయం లో తాము అగ్రస్థానం లో నిలిచిన విషయాన్ని ఈ సందర్భం గా మోదీ ప్రస్తావించారు. రానున్న రోజులలో న్యూ ఇండియా ని నిర్మించేందుకు తమ ప్రభత్వం కట్టు బడి ఉందని ప్రధాని మరో సారి స్పష్టం చేసారు.  

Leave a Reply

Your email address will not be published.