మందు బాబు లకు కిక్ దిగిపోనుందా…… ?

ఏపీ లో మందుబాబుల కోసం జగన్ ప్రభుత్వం లిక్కర్ కార్డులను ప్రవేశపెట్టనుంది మెడికల్ ఫిట్నెస్ ఉంటేనే లిక్కర్ కార్డుదొరుకుతుంది లిక్కర్ కార్డు ఉంటేనే మద్యం దొరుకుతుంది,లిక్కర్ కార్డులు జారీ చేసిన తర్వాత మద్యం తాగే వాళ్ళ సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు మద్యం కొనాలంటే ఈ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే లేకుంటే మద్యం దొరకదు ఈ కార్డు కావాలంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చెయ్యాలి. ఈ కార్డులో అమౌంట్ అయిపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు, దశలవారీ మద్యనిషేధం లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా 5000 రూపాయలు డిపాజిట్ కట్టి లిక్కర్ కార్డు కొనే ఆర్థిక స్తోమత తక్కువ మందికే ఉంటుంది మిడిల్ క్లాస్ ప్రజలు కూలీలు ప్రతి రోజూ వచ్చే కూలీ డబ్బులతోనే మద్యం కొంటున్నారు లిక్కర్ కార్డు జారీ అయితే జేబులో డబ్బుతో కొనే పరిస్థితి ఉండదు ఒకవేళ కార్డు వాడేసి మద్యం కొందాం అనుకుంటే అది ఎంత మాత్రం కుదరదు ఈ కార్డు ద్వారా ఎంత మద్యం కొంటున్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి డి అడిక్షన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు ఏపీ ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం ఒక వ్యక్తి కి కార్డు ద్వారా మూడు కంటే ఎక్కువ బాటిళ్ల కోదాం అనుకొన్న మద్యం
అమ్మరు, పరిమితికి మించి కొంటె మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు ఒకసారి రద్దయితే ఎప్పటికీ కొత్త కార్డు జారీ చేయరు డబ్బులు ఉన్నా తిరిగి ఇవ్వరు దీంతో పేదలు మద్యానికి దూరం అవుతారని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి నివేదించారు సీఎం ఆమోదం రాగానే కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు, ఏపీలో ఇప్పటికే ప్రైవేటు వైన్ షాపులు 40 శాతం అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది ప్రైవేట్ వైన్ షాపులు స్థానంలో సర్కార్ మద్యం దుకాణాలను తెరిచింది ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్ముతూ ప్రజల చేత మద్యపానం మాన్పించే ప్రయత్నం చేస్తున్నారు మద్యం కొనాలంటే ప్రజలకు రెండు విడతల్లో 60 నుంచి 70 శాతం భారీగా రేట్లు కూడా పెంచింది ఈ చర్యలతో గత నాలుగు నెలల్లో ఏపీలో లిక్కర్ వాడకం 13 శాతం తగ్గింది కానీ ధరల పెంపుతో సర్కార్ కు మద్యంపై వచ్చే ఆదాయం పెరిగింది ప్రస్తుతం ఉన్న షాపులు నాలుగేళ్లలో ఏటా 20 శాతం చొప్పున తగ్గించి మద్యాన్ని స్టార్ హోటల్ కి పరిమితం చేస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు ఎక్సైజ్ శాఖ జారీచేసేకార్డు కావాలంటే 25 ఏళ్లు వయసు వారికి మాత్రమే దొరుకుతుంది ఆధార్ కార్డు పాన్ కార్డ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ కార్డుప్రతీ సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకునేటప్పుడు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది